Rs.75 లక్షల సహాయం: పవన్ కల్యాణ్ | Pawan Kalyan 75 Lakhs Aid To Veerajavan Murali Nayak Family
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణల్లో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీనాయక్ స్మృతికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. సత్యసాయి జిల్లా కళ్లితండా గ్రామంలో జవాన్ భౌతిక కాయానికి గౌరవం చేస్తూ, అతని కుటుంబాన్ని ఓదార్చారు.
ప్రభుత్వం మరియు పవన్ కల్యాణ్ సహాయం
సహాయ వివరాలు | మొత్తం (రూ.) |
---|---|
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | 50 లక్షలు |
పవన్ కల్యాణ్ వ్యక్తిగతం | 25 లక్షలు |
భూమి & ఇంటి స్థలం | 5 ఎకరాలు + 300 గజాలు |
ఉద్యోగ హామీ | 1 సభ్యుడికి |
ప్రభుత్వం తరపున Rs.50 లక్షలు, పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత నిధుల నుండి Rs.25 లక్షలు ఇవ్వడంతో పాటు, 5 ఎకరాల భూమి మరియు 300 గజాల ఇంటి స్థలం కూడా ప్రకటించారు. మురళీనాయక్ స్మారకార్థం ఒక స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
మురళీనాయక్ త్యాగం: పరిస్థితి వివరాలు
2022లో అగ్నివీర్‌గా సైన్యంలో చేరిన మురళీనాయక్, ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూ-కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ పాకిస్తాన్ కాల్పులలో వీరమరణం పొందారు. అతని త్యాగాన్ని గుర్తుచేస్తూ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.
సినీ ప్రముఖుల సహాయం
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా మురళీనాయక్ కుటుంబానికి తన నెల జీతం విరాళంగా ఇచ్చారు. “వీరజవాన్ల త్యాగం దేశం ఎప్పటికీ మరచిపోదు” అని ఆయన పేర్కొన్నారు.
వీరజవాన్ మురళీనాయక్ వంటి వీరుల త్యాగాన్ని గౌరవించడం మన అన్ని ళ్ల కర్తవ్యం. ప్రభుత్వం, సినీ నాయకులు చేసిన సహాయాలు వారి కుటుంబానికి ఒక చిన్న సాంత్వనం. “జై హింద్, జై జవాన్”!
My heartfelt salute to the brave son of Bharat, Murali Naik, who embraced martyrdom during Operation Sindoor. Murali's journey from the tribal hamlet of Gorantla, Kallithanda village in Sri Sathya Sai district to the frontlines of National Defence as Agniveer, is marked by his… pic.twitter.com/PV2xRs5hGm
— Pawan Kalyan (@PawanKalyan) May 11, 2025
ఇటువంటి తాజా పవనిజం వార్తల కోసం మన బ్లాగ్ పవనిజం ను రెగ్యులర్ గా చూడండి
Tags: వీరజవాన్, పవన్ కల్యాణ్, మురళీనాయక్, భారత్ సైన్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎక్స్‌గ్రేషియా, డిప్యూటీ సీఎం, వీరజవాన్ మురళీనాయక్
ఒకే, కానీ, దుర్భర జీవితం జీవిస్తూ కష్టాలో ఉన్నా వారిని కూడా చుడాలిగా, యుద్ధం అంటే సోల్జర్స్ గుర్తుకు వస్తారు, వారి వేరమరణాలు గుర్తుకు వస్తాయి, వారికీ రావలిసిని వాటిని గురించి ఏ గవర్నమెంట్ పట్టిచుకోవడం లేదు, ఇపుడు రాజకీయం కోసం బాగా పనికి వస్తుంది, కనీసం 2 లేదా 3 సెంట్లు ఇండ్ల స్థలం కోసం, దశాబ్దాల లాగ ఎదురు చూస్తూ ఉన్నా, గవర్నమెంట్ లు పాటించాకోవడం లేదు, ఉద్యోగం లో అన్యాయం, రిజిస్ట్రేషన్ లలో అన్యాయం, అన్నిటి లో అన్యాయం,, సోల్జర్స్ కి అన్యాయం చేసిన వాడికి చావు, ఉగ్రవాదులు కంటే భయం కరం గా ఉంటది. ఇవ్వాళా సంతోషం గా ఉండవచ్చు, కానీ వాళ్ళు చావు నరకం లో కూడా భయం కరం గా ఉంటది.
Very very dedicated politician pavan kalyan 100percent better than ys jagan future cm of andrah pradesh